TS Jobs Calendar 2024:
Hai Friends… TS Jobs Calendar 2024 అతి త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కోడ్ ముగియగానే దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది.
- ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు
- అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం
- వేగంగా సాగుతున్న కసరత్తు
- జాబ్ క్యాలండర్ రూపకల్పన
కొత్త తెలుగు ఏడాది లో సర్కార్ వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు TS Jobs Calendar 2024 ఆదేశాలు జోర్ట్ చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా TSPSC కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల Final Results ను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియ ముగించాలని చూస్తోంది. అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్ల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది.
ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా TS Jobs Calendar 2024 ముమ్మర కసరత్తుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో 50 వేలకు పైగా Vacancies భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే Job Calendar రూపకల్పనకు రెడీ అవుతోంది. దీంతో అనేక సమస్యలు తీరనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం ఎజెండా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా జాప్యం లేని రీతిలో నియామకాల పూర్తికి వీలుగా ఆదేశాలు జారీ చేస్తోంది.
TS Jobs Calendar 2024 – Details:
ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే రాత పరీక్షల ఫైనల్ కీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్ధేశించుకుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 18 వేలకు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది.
2023లో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్-1 తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరీక్షలు మళ్లీ నిర్వహించినా సాంకేతిక కారణాలతో రిజల్ట్ వెల్లడించలేదు. పేపర్ల లీకేజీల వ్యవహారం తర్వాత టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసింది. పారదర్శక పరీక్షలు, నియామకాల కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్ పీఎస్సీ బోడును పునర్నియమించింది. కొత్త బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామిక ప్రక్రియ పూర్తి చేసి, 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించింది. కొత్తగా గ్రూప్-1 ప్రకటన జారీ చేయడం సహా కీలకమైన గ్రూప్-2 గ్రూప్-3తో పాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్ష తేదీలు ప్రకటించింది.
గ్రామ వాలంటీర్లకు 10 వేలు జీతం ఎప్పటినుంచంటే ?
ఇప్పటికే జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. అందులో భాగంగా జిల్లా స్థాయిపోస్టులైన గ్రూప్ – 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించనున్నారు. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన ప ర్తైన వెంటనే, తుది ఫలితాలు వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుదికీ వెలువరించనుంది. ఆ తర్వాత మరిన్ని ఖాళీలను గుర్తించి ప్రకటించినట్లుగానే నియామక ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.
ఇంటర్ విద్యావిభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబరులో ఉద్యోగ ప్రకటన జారీ కాగా 2023 అక్టోబరులో రాత పరీక్షలు పూర్తయ్యాయి. రానున్న పది రోజుల్లో కీ వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. రాతపరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావులేకుండా కమిషన్ చెక్ పెడుతోంది. గతంలో ప్రశ్నాపత్రం రూపొం దించినప్పుడు నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకొని, సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. తద్వారా జాప్యంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితు లు నెలకొనేవి. ఈ తరుణంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుండటంతో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు దాదాప తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే మళ్లీ పరిశీలించి తుది కీ వెలువరిస్తోంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.