Donald Trump Offer:
Donald Trump Offer: అమెరికాకు అక్రమ వలసదారులు వెళుతూ ఉంటారు. వారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద Offer ఇచ్చాడు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి నియమింపబడిన డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో మొండిగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల దేశాలకు సంబంధించిన వందలాదిమంది అక్రమ వరసదారులను అమెరికా నుంచి వారి యొక్క సొంత దేశాలకు పంపించే ఉద్దేశంలో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.
Donald Trump Offer – Details: ట్రంప్ ఆ విధంగా వరసదారులకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటంటే ఆక్రమంగా ఉంటున్నటువంటి ఇతర దేశస్తులు స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి విమాన ఖర్చుతో పాటు కొంత డబ్బును కూడా అందజేస్తామని ట్రంప్ తెలియజేశారు.
ఇటీవల కాలంలో ఒక వార్త సంస్థకు ట్రంప్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా వివరించారు. దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటూ రకరకాల నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి పెట్టారని పేర్కొన్న ట్రంప్, చట్ట విరుద్ధంగా ఉన్న వారి పైన తగిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. దేశంలో ఉండే అక్రమ వలసదారులను కచ్చితంగా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తామని అయినా చెప్పారు.
సక్రమంగా అమెరికాకు వచ్చేవారు మాత్రమే రావాలి మిగతావారు మాత్రం రావడానికి లేదు. అదే విధంగా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు కూడా తక్షణమే వారి యొక్క సొంత దేశాలకు వెళ్ళిపోవాలి. అదే విధంగా విమానా టికెట్ తో పాటు కొంత మనీ కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.