AP DSC in 5 Days:
AP DSC in 5 Days: 16,347 పోస్టులకు అదనంగా 2,260 పోస్టులను కలిపి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలు విడుదల. వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ.5 రోజులలో డీఎస్సీ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన డీఎస్సీ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ గారు నిన్న ప్రెస్మీట్లో గుడ్ న్యూస్ చెప్పారు.16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అనేది AP DSC in 5 Days రిలీజ్ చేస్తామని చెప్పారు. SC వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే DSC పై ముందుకెళ్దామని ఆగడంతోనే ఆలస్యమైందని ఆయన వివరించారు. SC కమీషన్ రిపోర్టుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, రెండు రోజుల్లోనే ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే DSC కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.
AP DSC in 5 Days – Details: గతంలో మళ్లీ టెట్ నిర్వహించాల లేదా డైరెక్ట్ గా డీఎస్సీ పెట్టాలా అనేది ఆలోచన చేస్తున్నామని మంత్రి లోకేష్ గారు చెప్పారు. దీనికి గల ప్రధాన కారణం కొత్తగా D.ed బ్యాచ్ విడుదలైంది. వారికి టెట్టు లేకుండా డిఎస్సి రాయడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ టెట్ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు మంది లోకేష్ తెలియజేశారు. కానీ నిన్న ప్రెస్ మీట్ లో మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఒక వారం రోజుల క్రితం కూడా టెట్ నోటిఫికేషన్ తో పాటు డీఎస్సీకి సంబంధించిన షెడ్యూల్ ఒకేసారి విడుదల చేసి పక్కన బందీగా మొత్తం అన్ని కూడా భర్తీ చేస్తామని కూడా తెలియజేశారు. దీనిపైన అభ్యర్థుల్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి చూడవలసిందే ఒక ఐదు రోజులు ఆగితే గనుక దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. మరి ఏపీ ఏం చేస్తుందో చూడవలసి ఉంది.
TRT పెడతారా టెట్ పెడతారా లేదా డీఎస్సీ పెడతారా అనేది మనం వెయిట్ చేస్తేనే గాని క్లారిటీ రాదు.
SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. దీనిలో భాగంగా ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం కాసరత్తు చేస్తుంది. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
నార్మల్ డీఎస్సీ తో పాటు అదనంగా 2,260 Posts ను కలిపి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా SGT – 1136 & SA – 1124 పోస్టులు ఉన్నాయి.
నార్మల్ డీఎస్సీకి సంబంధించి జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
వీటికి అదనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి SGT – 1136 & SA – 1124 పోస్టులు విడుదల చేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.