Grama Sachivalayam Jobs:
Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. వీటి పరిస్థితి త్వరలోనే చేస్తామని మంత్రి గారి చెప్పారు. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వంలో పోస్టులు భర్తీ చేస్తారని అనుమానాలు ఉండేవి కానీ నిన్నటి రోజున గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని గుర్తించి వాటి పరిస్థితి త్వరలోనే Grama Sachivalayam Jobs నోటిఫికేషన్ విడుదల చేస్తామని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పడం జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగినటువంటి ఉద్యోగుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో భారీగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పని చేస్తున్న ఎంప్లాయిస్ పైన బాగా భారం పడుతుందని తెలియజేశారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా త్వరగానే భర్తీ చేస్తామని వాటికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది అని దానికి సంబంధించి చంద్రబాబునాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారని తెలియజేశారు. దీనితోపాటుగా ప్రజెంట్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చే అంశాల్లో కూడా చర్చిస్తున్నట్లు తెలియజేశారు.
Grama Sachivalayam Jobs – Vacancies:
ఖాళీల విషయానికొచ్చినట్లయితే 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అవసరం కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1,10,000 మంది ఉద్యోగులు ప్రజెంట్ పనిచేస్తున్నారు. దాదాపు 24 వేలకు పైగా ఖాళీలైతే ఉన్నాయి. కానీ చాలామంది వేరే జాబ్స్ రావడం వల్ల జాబ్స్ కి రిజైన్ చేయడం వల్ల ఈ కార్యాల సంఖ్య పెరిగి 30 వేలకు చేరుకుంది. అంటే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. వీటి బాధ్యత సంబంధించి ఎన్ని పోస్టులు గ్రీన్ సిగ్నల్ పడుతుందో మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.