హైదరాబాదులో రెండో దశ మెట్రో కి దాదాపుగా 19 కోట్లు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా మూడు మార్గాల్లో మొత్తం 86.5 కిలోమీటర్లు దీనికి సంబంధించి మార్గం అయితే పెట్టడం జరిగింది.
దీనిలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్ అలాగే జేబీఎస్ నుంచి శామీర్పేట మరియు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలలో ఈ మార్గాలు అయితే పెడుతున్నారు.
ఈ మూడు మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లు సిద్ధం చేయడం ప్రభుత్వం చేస్తున్న మొదటి పని. దీనిలో భాగంగా జేబీఎస్ నుంచి కార్ఖానా హకీంపేట శామీర్పేట వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది.
జేబీఎస్ నుంచి తాడ్బండ్ బోయిన్పల్లి సుచిత్ర కొంపల్లి మీదుగా మేడ్చల్కు దగ్గర మనకి 24.5 km వరకు విస్తీర్ణం ఉంటుంది.
ఎంసెట్ ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ వస్తుంది | TS EAMCET College Predictor 2025
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల వరకు ఇక్కడ మనకి మార్గం అయితే ఏర్పడుతుంది.
రెండవ దశలో భాగ ంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా పనిచేస్తూ ఈ ప్రాజెక్టు అంతా కూడా సకాలంలో కంప్లీట్ అయ్యేవిధంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన అంచనా వ్యయం ఎలా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం 30% గానూ మరియు కేంద్ర ప్రభుత్వం 18% భరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యాంకు నుంచి 48 శాతం రుణాలు తీసుకుంటారు. మిగిలిన నాలుగు శాతం డబ్బు పీ పి పి లో సమకూర్చుకునే విధంగా డిపిఆర్ రూపొందించారు