Mega DSC Soon:
Mega DSC Soon: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 20 లేదా 23వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం చూస్తుంది. టెట్ కూడా నిర్వహించము అని క్లియర్ గా చెప్పారు. డిఎస్సి రెండవ నోటిఫికేషన్ పైన కూడా అప్డేట్స్ ఉన్నాయి వాటి వివరాలు కూడా చూద్దాం.
Mega DSC Soon Details – ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ సంబంధించి శుభవార్త వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ Mega DSC Soon రాబోతుంది. విడుదల చేయడానికి ప్రభుత్వం చూస్తుంది.
డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 16,347 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఈనెల 20 లేదా 23వ తేదీన విడుదల చేసి 45 రోజులు ప్రిపరేషన్ టైం మరియు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చి వెంటనే 45 రోజుల తర్వాత పరీక్ష అనేది నిర్వహించి June కల్లో పోస్టింగ్స్ అనేవి ఇస్తామని కరాకండిగా చెప్పారు.
ఈ లోపు తక్కువ విద్యార్థులు ఉన్న ప్లేసెస్ లో ఉన్న టీచర్స్ ని ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూల్స్ కి బదిలీ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి వయోపరిమితి 42 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకే పెంచడం జరిగింది.. దీనికి కట్ ఆఫ్ తేదీ జూలై 1 2024 గా పెట్టడం జరిగింది. అయితే ఈ వయోపరిమితి సడలింపు అనేది కేవలం ఈ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కి మాత్రమే వర్తిస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
2260 2 వ DSC నోటిఫికేషన్:
రాష్ట్రంలో కొత్తగా 2012 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లు భారతికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1136 ఎస్జీటీ పోస్టులు మరియు 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయరు. ఈ నోటిఫికేషన్ అయిపోయిన అనంతరం మళ్లీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది.
45 రోజులు సమయం:
డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకోడానికి 45 రోజులు సమయం ఇవ్వడం జరుగుతుంది.. 45 రోజులు సమయం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా డీఎస్సీ పరీక్ష పెట్టి నియామకాలు చేపడతారు. అయితే టెట్ అనేది నిర్వహించమని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది.. డి.ఎస్.సి కన్నా ముందు టెట్ సాధారణంగా పెడుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం TET నిర్వహించమని కేవలం డిఎస్సీ పరీక్ష మాత్రమే పెడతామని చెప్పారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.