Ola Roadster X:
Ola Roadster X: ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే OLA సంస్థ వారు తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ బైక్ Ola Roadster X లాంచ్ చేశారు. ప్రస్తుతం EV ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే మొగ్గు చూపుతున్నారు.
OLA ఎలక్ట్రిక్ వాహనాలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అమ్మడు అవుతున్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు. అయితే ప్రస్తుతం OLA వారి సరికొత్త బైక్ Ola Roadster X డెలివరీలో సిద్ధం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ బైక్ లో ఇటీవల కాలంలో Ola డీలర్ల వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. డీలర్ల వద్ద ఈ బైక్ చూసిన తర్వాత వినియోగదారులు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కనపడుతుంది. ఈ బైక్స్ ను త్వరలోనే డెలివరీ కూడా స్టార్ట్ చేస్తామని సంస్థ వారు అధికారికంగా చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్పత్తి కూడా ఇటీవల కాలంలో ఫ్యాక్టరీలో స్టార్ట్ చేశారు. Ola Roadster X మొత్తం 3వేరియంట్స్లో లభిస్తుంది.
ఇద్దరు వేరువేరు బ్యాటరీ బ్యాక్ ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ బ్యాటరీల సామర్థ్యం చూస్తే 2.5 kwh, 3.5 మరియు 4.5 కే డబ్ల్యూ హెచ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే బ్యాటరీతో సంబంధం లేకుండా అన్ని రకాల లో కూడా 7 KW మిడ్ మౌంటెడ్ మోటార్ ద్వారా దీనికి శక్తి పొందుతుంది.
Ola Roadster X బేస్ ఎంట్రీ లెవెల్ మోడల్ లో 2.5 KWH బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే చాలా తక్కువ ప్రైస్ గా నిలిచింది. దీని ధర 74,999/- ఎక్స్ షోరూం ఉంది. పూర్తిగా చార్జింగ్ పెడితే 140 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేయవచ్చు. 3.4 సెకండ్లలో 0 – 40 కిలోమీటర్ల వేగాన్ని తీసుకుంటుంది. గరిష్టంగా చూస్తే 105 కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెడుతుంది.
మీట్ వేరియంట్ విషయాలకు వచ్చినట్లయితే 3.5 KWH బ్యాటరీతో వస్తుంది. దీని ధర 84,999/ -ఎక్స్ షోరూమ్ ఉంటుంది. దీని రేంజ్ 196 వరకు వెళుతుంది. 3.1 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్టంగా 118 కిలోమీటర్స్ వేగంగా వెళుతుంది.
Ola Roadster X ప్రీమియం మోడల్ లో 4.5 kwh బ్యాటరీతో వస్తుంది. 94,999/- ఎక్స్ షోరూం ధర ఉంది. ఇదే అత్యధిక బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 250 టు కిలోమీటర్స్ దూరం వెళ్ళవచ్చు. 3.1 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 118 కిలోమీటర్లు వేగంతో దూసుకు వెళ్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎం ఎం ఉంటుంది. 4.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్ ఉంటుంది. నావిగేషన్ కూడా ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.