TS GPO Jobs 2025:
TS GPO Jobs 2025: రాష్ట్రవ్యాప్తంగా GPO – గ్రామ పాలనా అధికారి 10,954 ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
తెలంగాణలో ప్రతిరోజు ఉద్యోగాల సునామి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే గ్రామ పాలన అధికారి TS GPO Jobs 2025 ఉద్యోగాలకు సంబంధించి గతంలో పనిచేసిన VRO / VRA లకు 6000 పోస్టులు ఇస్తామని గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా దానిని రద్దు చేస్తూ TS GPO Jobs 2025 కేవలం నిరుద్యోగులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచన మాకు ఉందని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
గ్రామ పాలన అధికారి – TS GPO Jobs 2025 పోస్టులన్నిటిని కూడా డైరెక్టర్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జిపిఓల నియామకాన్ని చేపట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సిద్దంగా 56 వేల జాబ్స్ త్వరలో నోటిఫికేషన్
భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా GPO ల నియామకం పూర్తి చేయాలని మేము చూస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఈ చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆలోచన చేసింది. సో ఈ నేపథ్యంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి ఉద్యోగాలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 10,954 పోస్టులో ఉన్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించిన జాబ్ చార్ట్ కూడా విడుదల చేసింది. వీఆర్ఏ వీఆర్వోల అర్హులైన వారిని తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఫస్ట్ అనుకున్నారు. అయితే గత ఉద్యోగులకు ఇంట్రెస్ట్ ఉన్నవారి నుంచి కలెక్టర్ ద్వారా ఆప్షన్స్ తీసుకున్నారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 7000 మందికి అర్హతలు ఉన్నట్లు కూడా తెలిసింది.. వారికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసింది. కానీ ఆ విధంగా చేయడం వల్ల వారు వాళ్ళ పాత సర్వీసింగ్ కోల్పోతారు. దీనివల్ల కొంతమంది కోర్టుకు వెళ్లారు కాబట్టి ఆ ప్రక్రియ అనేది ఆగిపోయింది.
ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగులందరికీ అవకాశం కల్పిస్తూ 10,954 GPO ఉద్యోగాలను డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది.. అయితే దీనికి విద్యార్హతలు ఏముండాలనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే టైంలోనే మీకు అర్హతలు ఏంటి, జీతాలు ఎలా ఉంటాయి అనే వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. . సెలెక్షన్స్ లో కూడా రాత పరీక్ష ద్వారానే పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.