Types of Ration Cards:
Types of Ration Cards: దేశవ్యాప్తంగా ప్రజలకు రేషన్ కార్డు ఉంటుంది. కానీ మీది ఏ రాషన్ కార్డు అనేది అడిగితే మాత్రం Card చూడకుండా చెప్పలేరు. అసలు ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి? దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Types of Ration Cards – రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతినెలా కూడా వివిధ రకాల సరుకులతో పాటు చాలా రకాల ప్రభుత్వ బెనిఫిట్ లు కూడా లభిస్తూ ఉంటాయి.. కానీ రేషన్ కార్డులలో కూడా చాలా రకాల రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రేషన్ కార్డుకి ఒక్కొక్క రకమైన బెనిఫిట్ లో ఉంటాయి. రేషన్ కార్డ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేటటువంటి ఒక రకమైనటువంటి గుర్తింపు కార్డు లెక్క. దీని ద్వారా జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తక్కువ ధరలకే భోజనం వండుకోవడానికి అవసరమైన ఆహార ధాన్యాలను మనం పొందవచ్చు. అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందు గుర్తింపు ఆధారంగా అర్హత ఉన్నటువంటి వారికి టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారా తక్కువ ధరలకు ఆహార పదార్థాలు ఇచ్చేవారు. 2013 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్హత ఉన్నటువంటి కుటుంబాలకి మొత్తంగా 3 Types రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
Types of Ration Cards – 3:
అంత్యోదయ అన్న యోజన (AAY)
ఆహార భద్రత
అన్నపూర్ణ యోజన
అంత్యోదయ అన్న యోజన (AAY):
ఆర్థికంగా బాగా వెనుకబడినటువంటి కుటుంబాలు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది.. నిరుద్యోగులు, వికలాంగులు, రోజువారి కూలీలు, లేబర్, నివేదంతోలు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ కార్డు ఇస్తారు.
ఈ కార్డు ఉంటే ప్రతి నెల ఆయా కుటుంబాలకు 35 కేజీల బియ్యం ఇస్తారు.
ప్రయారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డ్:
ఈ కార్డు ఎవరికి ఇస్తారంటే అత్యోదయ అన్న యోజన కార్డు పరిధిలోకి రానటువంటి కుటుంబాలు అందరికీ కూడా ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరుగుతుంది.
దరిద్ర రేఖకు (BPL) దిగువన ఉన్న కుటుంబాలకి ఈ కార్డు జారీ చేస్తారు.
40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారికి ట్రైబల్ కుటుంబాలకి ట్రాన్స్ జెండర్స్కు అదనంగా ఈ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.
వార్షికాదాయం ప్రభుత్వ నిర్ణయించిన దానికన్నా తక్కువ ఉన్నవారికి ఈ కార్డు ఇస్తారు.
ఈ కార్డు ఉంటే ప్రతినెలా ఒక మనిషికి ఐదు కేజీలు చొప్పున ధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ తెలంగాణలో మాత్రం ఒక మనిషికి 6 కేజీలు ఇస్తున్నారు.
అన్నపూర్ణ రేషన్ కార్డు:
ఒక మనిషికి 65 సంవత్సరాలు వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ముసలి వాళ్లకి ఈ కార్డు ఇస్తారు.
ఈ కార్డు ఉంటే నెలకు మీకు 10 కేజీలు బియ్యం ఇస్తారు. అది కూడా ఉచితంగా ఇస్తారు.
జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం లేదా రాష్ట్ర పెన్షన్ పథకం ద్వారా నెలవారి పెన్షన్ పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.